ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్…ఉపాధి కూలీల వేతన బకాయిలు విడుదల అయ్యాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కూలీలకు వేతన బకాయిలను కేంద్రం విడుదల చేసింది. రూ.663.57 కోట్లను వేతనాల చెల్లింపుల కోసం రాష్ట్రానికి మంజూరు చేసింది. రెండు, మూడు రోజుల్లో కూలీల ఖాతాల్లో నగదు జమ అవుతుందని సంబంధిత అధికారులు తెలిపారు. కాగా… గత నాలుగైదు వారాలుగా నిధుల లేమితో వేతన చెల్లింపులు నిలిచిపోయాయి.
ఇక అటు అసైన్డ్ భూములకు నష్టపరిహారంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా ప్రయోజనాల కోసం లేదా భూసేకరణ నిమిత్తం భూములు వెనక్కి తీసుకుంటే మార్కెట్ విలువ ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తామని తెలిపింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీచేసింది. ఇకపై అసైన్డ్ భూములు కలిగినవారికి ఇతర భూముల యజమానులతో సమానంగా మార్కెట్ విలువ ప్రకారమే చెల్లింపులు ఉంటాయని రెవెన్యూశాఖ ప్రత్యేక కార్యదర్శి అజయ్ జైన్ పేర్కొన్నారు.