విజయవాడలో APCC చీఫ్ వైఎస్ షర్మిలకు ఊహించని పరిణామం ఎదురైంది. APCC చీఫ్ వైఎస్ షర్మిల వాహన కాన్వాయ్ ను అడ్డుకున్నారు పోలీసులు. ఎనికే పాడు వద్ద వాహనాలను మళ్లించారు పోలీసులు. వాహనాలను డైవర్ట్ చేసేందుకు నిరసనగా రోడ్డుమీద బైఠాయించి నిరసన తెలిపారు కాంగ్రెస్ నేతలు గిడుగు రుద్రరాజు, సుంకర పద్మశ్రీ ఇతర కాంగ్రెస్ శ్రేణులు.
కాగా ఇవాళ APCC చీఫ్ గా వైఎస్ షర్మిల బాధ్యతలు తీసుకోనున్నారు. ఇక పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ప్రజల్లోకి వెళ్లనున్నారు వైఎస్ షర్మిళ.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్త పర్యటనకు రోడ్ మ్యాప్ సిద్దం చేసింది ఏపీ పీసీసీ. ఈ నెల 23వ తేదీ నుంచి జనంలోకి షర్మిల…వెళతారు. ఇచ్చాపురం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు వైఎస్ షర్మిల. ఇప్పటికే కాంగ్రెస్ నేతలకు..క్యాడరుకు షర్మిళ పర్యటనలపై సమాచారం ఇచ్చారు.