తిరుమల భక్తులకు శుభవార్త…ఇకపై శ్రీవారి అన్నప్రసాదంలో వడలు పెట్టనున్నారట. తిరుమలలోని వెంగమాంబ అన్నప్రసాద్ కేంద్రంలో ఈ నెల 6వ తేదీ నుంచి… తిరుమల శ్రీవారి భక్తులకు వడలు కూడా అందించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమాన్ని టిటిడి చైర్మన్, టీవీ 5 ఛానెల్ బి.ఆర్ నాయుడు ప్రారంభించబోతున్నట్లు సమాచారం అందుతోంది.

ఈ మేరకు చర్యలు తీసుకుంటుందట టిటిడి పాలక మండలి. కాగా పైలెట్ ప్రాజెక్టుగా జనవరిలో వారం రోజులపాటు రోజుకు 5000 చొప్పున వడలు వడ్డించిన సంగతి తెలిసిందే. అయితే లక్ష మంది భక్తులకు వడ్డించేందుకు.. సిబ్బంది కొరత ఏర్పడుతోందని చెబుతున్నారు. దీనిపై చర్యలు తీసుకొని త్వరలోనే వడలు… ప్రారంభించనున్నారట. ఇక టీటీడీ పాలక మండలి తీసుకున్న ఈ నిర్ణయంపై తిరుమల శ్రీ వారి భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా నిన్న ఒక్క రోజే.. తిరుమల శ్రీవారిని 65683 మంది భక్తులు దర్శించుకున్నారు.