గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త..మే నెలలోనే బదిలీలు

-

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది జగన్‌ సర్కార్‌. నిన్న ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, ఉద్యోగ సంఘాల నాయకులతో ఇన్ ఫార్మల్ మీటింగ్ జరిగిందని.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బదిలీలు, పెండింగ్ నిధులు వంటి అంశాల పై చర్చించాని వివరించారు.

అన్ని అంశాలకు టైం బాండ్ పెట్టామని.. మే ఒకటి నుంచి వరుసగా జీవోలు జారీ అవుతాయని వెల్లడించారు. పీఆర్సీ కమిటీని ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని.. ఓపీఎస్ పై అడిగారు…తర్వాతి సమావేశంలో చర్చిద్దాం అని చెప్పాన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ చర్చకు వచ్చిందని.. ముఖ్యమంత్రి కూడా ఈ అంశం పై సానుకూలంగా ఉన్నారని పేర్కొన్నారు. త్వరలోనే గైడ్ లైన్స్ రూపొందించాలని చెప్పామని వివరించారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ.

Read more RELATED
Recommended to you

Exit mobile version