ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఈ నెలఖారులో గ్రూప్-1,2 నోటిఫికేషన్లు విడుదల ఖానున్నాయి. ప్రభుత్వ శాఖల్లోని 1,603 ఉద్యోగాల భర్తీకి వేర్వేరు నోటిఫికేషన్లను విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. గ్రూపు-1 కింద 88, గ్రూపు-2 కింద 989 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. గ్రూపు-1 కింద అదనంగా మరికొన్ని క్యారీ ఫార్వర్డ్ కేటగిరీ (నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ భర్తీ కానివి) పోస్టులు కలుస్తాయని వెల్లడించింది.
ఏ పోస్టులు ఎన్ని ఉంటాయంటే..
డిగ్రీ కళాశాలల అధ్యాపకుల పోస్టులు-267
పాలిటెక్నిక్ కళాశాలల అధ్యాపకులు-99
టీటీడీ డీఎల్, జేఎల్-78
జూనియర్ కళాశాలల అధ్యాపకులు-47
డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్-38
ఇంగ్లిష్ రిపోర్టర్స్ (ఏపీ లెజిస్లేచర్ సర్వీస్)-10
గ్రంథపాలకులు (కళాశాల విద్య)-23
ఏపీఆర్‌ఈఐ సొసైటీ కింద 10 జేఎల్ 05 డీఎల్ పోస్టులు
ఫిషరీస్ డిపార్ట్‌మెంట్‌లో 4 డెవలప్‌మెంట్ ఆఫీసర్
మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌లో 4 గ్రంథ పాలకుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడనున్నాయి.