రాజకీయాన్ని పవన్ కళ్యాణ్.. వెబ్ సిరీస్ అనుకుంటున్నాడు – మంత్రి గుడివాడ

-

రాజకీయాన్ని పవన్ కళ్యాణ్.. వెబ్ సిరీస్ అనుకుంటున్నాడని చురకలు అంటించారు ఏపీ మంత్రి గుడివాడ అమర్‌ నాథ్‌. సినిమాలలో పవన్ కళ్యాణ్ హీరో కానీ… రాజకీయాలలో సైడ్ క్యారక్టర్ అంటూ ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ సినిమాలో అసలు విలన్ చంద్ర బాబు నాయుడు అని ఫైర్‌ అయ్యారు. మొన్నటి వరకు పార్ట్-1 అయింది.. ఇప్పుడు వారాహి పార్ట్-2 అంట అంటూ చురకలు అంటించారు.

2019 అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్ మళ్లీ రిపీట్ అవుతుందని స్పష్టం చేశారు. చంద్ర బాబు నాయుడును భుజాల మీద మొయ్యడనికి ఓ రాజకీయ పార్టీ అవసరమా పవన్ కళ్యాణ్ అని ఫైర్‌ అయ్యారు. నేషనల్ మీడియాలో పవన్ కళ్యాణ్ భార్యతో విడిపోయారు అని వార్త వస్తే… వెంటనే భుజాలు తడుముకుని ఒక ఫోటో విడుదల చేశారని మండిపడ్డారు. కొన్ని పత్రికలలో ఏపీ ప్రభుత్వంపై కడుపు మంటతో తప్పుడు కథనాలు రాస్తున్నారని… జాకీ లు పెట్టీ చంద్ర బాబు నాయుడును లేపే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు ఏపీ మంత్రి గుడివాడ అమర్‌ నాథ్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version