వచ్చే ఏడాది నుంచి ఇంటర్‌ విద్యార్థులకు గైడ్స్‌ మెటీరియల్‌ – నారా లోకేష్‌

-

వచ్చే ఏడాది నుంచి ఇంటర్‌ విద్యార్థులకు గైడ్స్‌ మెటీరియల్‌ ఇస్తామని మంత్రి నారా లోకేష్‌ ప్రకటించారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించారు మంత్రి నారా లోకేష్‌. విజయవాడలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. ఇక్కడ విద్యార్ధులను చూస్తే సంక్రాంతి ముందే వచ్చినట్టుందని… దేవుడు ఒకొక్కరికీ ఒకొక్క పరీక్ష పెడతారని వెల్లడించారు. పరీక్షలో ఫెయిల్ అయితే ఆత్మహత్య చేసుకోకూడదు.. సప్లిమెంటరీ ఉంటుందన్నారు.


ప్రభుత్వ కళాశాలల్లో చదువే విద్యార్ధుల భవిష్యత్తు చాలా ముఖ్యం అన్నారు. పాఠశాల విద్య లో రాజకీయాలు దూరంగా ఉండాలని… విద్యార్ధులకు ఇచ్చే వాటిలో మా పేర్లు, ఫోటోలు ఉండవు అని వివరించారు. ప్రభుత్వ పాఠశాళు, కళాశాలల విద్యార్ధులు రాజకీయ కార్యక్రమాలకు వెళ్ళరు…. యాప్ ల భారం ఉపాధ్యాయులపై ఉంది.. అది పూర్తిగా తీసేసే ఆలోచనలో ఉన్నామన్నారు. పాఠ్య పుస్తకాలలో ఇంటిపనులు చూపించే ఫోటోలలో మగ, ఆడ ఇద్దరి ఫోటోలు ఉండాలని నిర్ణయించామన్నారు లోకేస్‌. A B C కింద పాఠశాలల్లో విద్యార్ధులను విభజించి అదనపు సప్లిమెంట్లు ఇస్తున్నామని చెప్పారు. వచ్చే సంవత్సరం నుంచీ విద్యార్ధులకు గైడ్ లు, అదనపు మెటీరియల్ కూడా ఇస్తామని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version