TDP,BJP, జనసేన పార్టీలకు హరి రామ జోగయ్య లేఖ..వారికి లక్ష రూపాయాలు ఇవ్వండి !

-

తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమి అధినాయకులకో విజ్ఞప్తి అంటూ మాజీ మంత్రి చేగొండి హరి రామ జోగయ్య లేఖ విడుదల చేశారు. కాపు తెలగ బలిజ ఒంటరి కులస్తులును బ్రిటిష్ కాలంలోనే బీసీ కులస్తులుగా పరిగణించారు… ఒక్క దామోదర సంజీవయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మినహా మిగిలిన అగ్రకులస్తులు ముఖ్యమంత్రులుగా ఉన్న రోజుల్లో బీసీ జాబితా నుండి తొలగించారని తెలిపారు. 25 శాతం జనాభా ఉన్న కాపు కులస్తులను నమ్ముకుని జనసేన, తెలుగుదేశం, బిజెపి కూటమి ఉన్నాయన్నారు. ఉమ్మడి మేనిఫెస్టోలో క్రింద ఉదాహరించిన సంక్షేమ పథకాలను ప్రకటిస్తూ హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

బీసీలతో సమానంగా సంక్షేమ సౌకర్యాలు అందజేయాలని తెలిపారు. జనాభా ప్రాతిపదికన కాపు కార్పొరేషన్ కు సంక్షేమ బడ్జెట్ కేటాయించాలని.. వృద్ధాప్య పెన్షన్ పరిమితి 50 సంవత్సరాలకు కుదించాలని లేఖలో పేర్కొన్నారు. జనాభా ప్రాతిపాదికన విద్య ఉద్యోగ రాజకీయ పదవుల్లో రిజర్వేషన్ కలుగజేయాలి..వృద్ధాప్య పెన్షన్ 3000 నుండి 4 వేల రూపాయలకు పెంచాలి…పెళ్లి ఖర్చు నిమిత్తం పెళ్లి కానుకగా లక్ష రూపాయలు ఇవ్వాలన్నారు.18 సంవత్సరాల నుండి 49 సంవత్సరాల వయసు ఉన్న మహిళలకు కాపు నేస్తం 16 వేల రూపాయలు ఇవ్వాలని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version