తూర్పుగోదావరి రాజమండ్రి బొమ్మూరు పోలీస్ స్టేషన్ లో దారుణం చోటు చేసుకుంది. బొమ్మూరు పోలీస్ స్టేషన్ లో మహిళా హోంగార్డుతో అసభ్యంగా ప్రవర్తించాడు ఓ హెడ్ కానిస్టేబుల్. ఈ నెల 8వ తేదీన నైట్ డ్యూటీలో ఉంటూ అర్ధరాత్రి సమయంలో పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్. అయితే… స్టేషన్ లో ఉన్న మహిళా హోంగార్డుతో అసభ్యంగా మాట్లాడి చెయ్యి పట్టుకునేందుకు యత్నించాడు హెడ్ కానిస్టేబుల్.
ఈ తరుణంలోనే… అసభ్య ప్రవర్తన ఫోన్ లో చిత్రీకరించేందుకు మహిళా హోంగార్డు యత్నించడంతో స్టేషన్ నుంచి వెళ్లిపోయాడు హెడ్ కానిస్టేబుల్. అనంతరం భర్తతో కలిసి జిల్లా ఎస్పీ నరసింహా కిషోర్ కి ఫిర్యాదు చేశారు బాధిత మహిళా హోంగార్డు. దీంతో హెడ్ కాని స్టేబుల్ పై కేసు నమోదు చేసి, సస్పెండ్ చేశారు జిల్లా ఎస్పీ నరసింహా కిషోర్. ఇక ఈ సంఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నారు అధికారులు.