కృష్ణాజిల్లా గుడివాడలో దారుణం చోటు చేసుకుంది. గుడివాడ మండలం గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్ వాష్‌రూమ్‌లో రహస్య కెమెరా పెట్టారంటూ విద్యార్థుల ధర్నాకు దిగారు. సుమారుగా 300 పైగా వీడియోలు బాయ్స్ హాస్టల్‌కు చేరినట్లు సమాచారం అందుతోంది. బాయ్స్ హాస్టల్‌కు చెందిన కొంతమంది కొనుగోలు చేసినట్లు సమాచారం అందుతోంది.
గర్ల్స్ హాస్టల్‌కు చెందిన ఒక స్టూ డెంట్ సహకారంతో బాయ్స్ హాస్టల్‌కు చెందిన కొంతమంది ఈ దుర్ఘటనకు పాల్పడ్డారని పోలీసులు గుర్తించారు. దీంతో ఒక్కసారిగా ఇంజనీరింగ్ కళాశాలలో గర్ల్స్ న్యాయం కోరుతూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడం జరిగింది. వారం రోజుల క్రితమే ఈ విషయం వెలుగు చూసిన మేనేజ్మెంట్ స్పందించలేదంటూ….. ఆరోపిస్తున్నారు విద్యార్థులు. ఈ సంఘటనపై వివరాలు వెల్లడించేందుకు నిరాకరిస్తున్నారు పోలీసులు. ఆరోపణలు వచ్చిన ఫైనల్ ఇయర్ విద్యార్థి విజయ్ ను ప్రశ్నిస్తున్న పోలీసులు..ఏ వివరాలు మీడియాకు క్లారిటీగా చెప్పడం లేదని సమాచారం.