ఐరన్ కడాయిలో ఈ 4 అస్సలు వండకండి.. చాలా ప్రమాదం..!

-

వంట చేసేటప్పుడు మనం చూసే చిన్న చిన్న పొరపాట్లు పెద్ద ప్రమాదానికి దారితీస్తాయి. వంట చేసేటప్పుడు కొన్ని పొరపాట్లు చేయకుండా చూసుకోవాలి. లేదంటే ప్రమాదంలో పడ్డట్టే. ముఖ్యంగా ఐరన్ కడాయిలో వండేటప్పుడు మాత్రం వీటిని అస్సలు వండద్దు. ఈ తప్పు చేశారంటే ఎంతో నష్టం కలుగుతుంది. ఐరన్ కడాయిలో ఇప్పటి వరకు మీరు వీటిని వండినట్లయితే వీటిని వండడం మానేయండి దీని వలన చాలా పెద్ద ప్రమాదం కలుగుతుంది.

పుల్లటి ఆహార పదార్థాలు:

ఐరన్ కడాయిలో ఎప్పుడు కూడా పుల్లటి ఆహార పదార్థాలను వండకూడదు. ఇది చాలా ప్రమాదకరం. ఆహారం రుచి కూడా చాలా మారిపోతుంది.

ఆకుకూరలు:

ఐరన్ పాత్రలో ఆకుకూరలు వండడం కూడా మానుకోవాలి. ఐరన్ పాత్రలో ఆకుకూరలు వంటివి వండడం వలన ఆరోగ్యం పాడవుతుంది. పైగా ఆకుకూరలు నల్లగా మారిపోతాయి. సమస్యలకి దారి తీస్తుంది.

గుడ్లు:

ఐరన్ కడాయిలో గుడ్లు, చేపలు వంటివి వండకూడదు. రుచి కూడా మారిపోతుంది. పైగా గరిటలకి అంటుకున్న నూనె వంటివి క్లీన్ చేసుకోవడం కూడా కష్టంగా ఉంటుంది.

స్వీట్లు:

ఐరన్ కడాయిలో స్వీట్లు వండడం కూడా మంచిది కాదు. దీని వలన అదో రకమైన వాసన రావడం, పాత్రలను కడిగినా కూడా ఆ వాసన పోకపోవడం, ఆహారం పాడైపోవడం వంటివి కలుగుతాయి. కాబట్టి వీటిని కూడా అస్సలు వండకండి.

అయితే ఐరన్ లోపం ఉన్నవారు ఐరన్ కడాయిలో వంట చేసుకోవడం వలన శరీరానికి పోషకాలు తగినంత అందుతాయి. కొన్ని రకాల పదార్థాలు మాత్రం వండకుండా జాగ్రత్త పడండి. ఏవైనా డైరీ ప్రొడక్ట్స్ కూడా ఇందులో వండకూడదు. పాలు వంటివి విరిగిపోవచ్చు. కొన్ని రకాల ఆహార పదార్థాలు రుచి కూడా మారిపోతాయి. కెమికల్ రియాక్షన్స్ కారణంగా ఇలా జరుగుతుందట. అలాగే ఎక్కువ స్పైసీగా ఉండే ఆహార పదార్థాలని ఐరన్ కడాయిలో వండితే కారం, మసాలా పాత్రలకు అంటుకుపోతాయి. కొన్ని రకాల ఫ్లేవర్స్ ని ఆకర్షించే గుణం ఐరన్ కి ఉంది. స్పైసీ ఫుడ్ ని రాగి లేదా స్టెయిన్లెస్ స్టీల్ లో వండడం మంచిది. నాన్ రియాక్టివ్ కుక్ వేర్స్ లో వండాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version