విశాఖ పరిధి భీమిలిలో హనీ ట్రాప్ కలకలం రేగింది. శ్రీకాకుళం వాసి రామారావుకు ఈనెల 18 నుంచి ఓ యువతి నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయట. ఈనెల 19న పెద్దిపాలెం వెళ్తుండగా మరోసారి రామారావుకు ఫోన్ కాల్ వచ్చినట్లు సమాచారం. సంగివలస మూడుగుళ్ల వద్దకు రావాలని రామారావుకు ఫోన్ చేసిందట ఓ యువతి. రామారావు రాగానే కిడ్నాప్ చేశారు నలుగురు దుండగులు. దాకమర్రిలో నిర్మానుష్య ప్రాంతానికి రామారావును తీసుకెళ్లారు దుండగులు.
అనంతరం రామారావు వద్ద రూ. 48 వేలు, ఏటీఎం కార్డులు లాక్కున్నారు దుండగులు. ఏటీఎం నుంచి మరో 7000 డ్రా చేశారు దుండగులు. నగదు మాయంపై భీమిలి పీఎస్ లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఇక దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందుతోంది.