దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సు సమావేశాలు ముగించుకుని గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఢిల్లీకి చేరుకున్నారు సీఎం చంద్రబాబు. నిన్న సాయంత్రం 4.30 గంటలకు జ్యూరిచ్ నుంచి బయలుదేరి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు చంద్రబాబు నాయుడు. అక్కడి నుంచి నేరుగా వన్ జన్‌పథ్‌లోని తన అధికారిక నివాసానికి చేరుకున్నారు చంద్రబాబు.
ఇక శుక్రవారం ఉదయం కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇక అటు దావోస్‌లో పెట్టుబడుల సమీకరణలో బిజీగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి తిరుగు ప్రయాణం అయ్యారు. దీంతో సీఎం చంద్రబాబు, సీఎం రేవంత్ ఇద్దరూ వేరు వేరుగా ఇండియాకు చేరుకున్నారు.
దావోస్‌లో పెట్టుబడుల సమీకరణలో తెలంగాణ సరికొత్త రికార్డు
గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర చరిత్రలో భారీ పెట్టుబడులు
వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో ఇప్పటికే రూ 1.32 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించిన తెలంగాణ ప్రభుత్వం
గత ఏడాది దావోస్ పర్యటనలో రాష్ట్రానికి రూ 40,232 కోట్ల… pic.twitter.com/W3XjvPU9Kb
— BIG TV Breaking News (@bigtvtelugu) January 23, 2025