అనంతబాబుపై జగన్ సర్కారుకు ఎందుకంత ప్రేమ – సిపిఐ రామకృష్ణ

-

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారం పై రాజకీయ వేడి ఇంకా తగ్గలేదు. తక్షణమే ఎంపీపై చర్యలు తీసుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ డిమాండ్ చేశారు. ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారంలో.. అనంతపురం ఎస్పీ ఫకీరప్ప ఎటువంటి విచారణ లేకుండా ఫేక్ అన్నట్లు ఎలా తేల్చారని మండిపడ్డారు. అలాగే ఎమ్మెల్సీ అనంత బాబు హత్య కేసు పై మాట్లాడుతూ.. హత్య చేసిన ఎమ్మెల్సీ ని, మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన ఎంపీని రక్షించడమే సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ధ్యేయమా? అంటూ ప్రశ్నించారు.

cpi-ramakrishna-ys-jagan

90 రోజుల్లోపు చార్జిషీట్ వేయకుండా పోలీసులు అనంతబాబుకి ఎందుకు సహకరిస్తున్నారని మండిపడ్డారు. అనంత బాబుకు బెయిల్ వచ్చేందుకు చేస్తున్న కుట్రవెనకక ఎవరున్నారని అన్నారు. మనిషిని చంపి, కారులో డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంత బాబు పై జగన్ సర్కారుకు ఎందుకంత ప్రేమ? అని ప్రశ్నించారు. అనంత బాబు కేసులో పోలీసు, ప్రభుత్వ వైఫల్యంపై ఉద్యమిస్తామన్నారు రామకృష్ణ.

Read more RELATED
Recommended to you

Exit mobile version