ఏపీ పీసీసీ కొత్త సారథి రేసులో నేను లేను – మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్

-

ఆంధ్రప్రదేశ్ లో విద్యా ప్రమాణాలు నాశనం కావడానికి రాష్ట్ర ప్రభుత్వ వైఖరే కారణమని అన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి చింతామోహన్. దేశంలో, రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య విలయతాండవం చేస్తుందన్నారు. ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని నాశనం చేసిన వ్యక్తి గులం నబి ఆజాద్ అని మండిపడ్డారు. ఆయన ఉంటే ఎంత? లేకుంటే ఎంత? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన వల్లే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ నాశనమైందని మండిపడ్డారు చింతామోహన్. రాహుల్ గాంధీ పాదయాత్ర సఫలం అవుతుందని.. 2024లో కేంద్రంలో అధికారం కాంగ్రెస్ పార్టీ దేనిని ధీమా వ్యక్తం చేశారు.

చిన్న మైన్ తీసుకున్న సొరెన్ ను పదవి నుండి తొలగించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ చర్య తీసుకుందని.. అలాంటిది ఏపీలో మైన్లను కొల్లగొట్టిన ప్రజా ప్రతినిధులపై ఎందుకు ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. గిరిజన ముఖ్యమంత్రి పై చర్యలు తీసుకున్న ఈసీ.. ఏపీలో మైన్లను కొల్లగొట్టిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఏపీ పీసీసీ కొత్త సారధి కోసం అన్వేషణ మొదలైందని.. అధ్యక్ష రేసులో తాను లేనని స్పష్టం చేశారు చింతామోహన్. ఒక సామాన్య వ్యక్తిని ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నుకోవాలనేదే అందరి ఆకాంక్ష అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version