వంశధార ప్రాజెక్టు కార్యాలయంలో ఎస్ఈ తిరుమలరావుని కలిశారు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు. శివారు ఆయకట్టు భూములకు సకాలంలో నీరు అందివ్వాలంటూ ఎస్ఈ ని కోరారు ఎంపీ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఫల్యం కారణంగా ఈరోజు ఉత్తరాంధ్ర రైతు సాగునీరు అందక కన్నీరు కారుస్తున్నారని అన్నారు. శివారు ఆయకట్టు ప్రాంతాలపైన నందిగామ, వజ్రపు కొత్తూరు, పలాసలాల్లో సుమారు 25వేల ఎకరాలకు సాగునీరు అందడంం లేదన్నారు. రెండు రోజుల్లో నీరు అందకపోతే వరి నాట్లు చనిపోయే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి ఏసీలో కూర్చుని మాటలు చెప్పడం కాదు.. ప్యాలెస్ ని వదిలి బయటకు వచ్చి చూస్తే రైతుల కష్టాలు తెలుస్తాయని మండిపడ్డారు. ఏదో చేస్తున్నామని మాయమాటలు చెప్పి ఇష్యూ ని డైవర్ట్ చేయకూడదని అన్నారు. రైతుల సాగునీటి కష్టాలను వెంటనే పరిష్కరించకపోతే తీవ్రంగా పోరాటం చేస్తామన్నారు. మినిస్టర్లు సాగునీటి ప్రాజెక్టుల పైన, రైతుల కష్టాల పైన సమీక్షలు జరపరు, కనీసం లస్కర్ లను ఏర్పాటు చేయరని మండిపడ్డారు.