వైసీపీ ప్రభుత్వ హయాంలో పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీలక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమాన్యాన్ని విజిలిన్స్ తనిఖీల ముసుగులో బెదిరించి.. రూ.2.20 కోట్లు అక్రమంగా వసూలు చేశారనే అభియోగం పై మాజీ మంత్రి విడదల రజినీ పై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈకేసు పై ఆమె సోషల్ మీడియా వేదికగా ఇంట్రెస్టింగ్ ట్వీట్ పెట్టారు.
మనో ధైర్యాన్ని దెబ్బతీయాలనే నాపై కుట్రలు చేస్తున్నారు. వ్యక్తిత్వాన్ని హరించాలనే కుయుక్తుు పన్నుతున్నారు. అక్రమ కేసులే మీ లక్ష్యం అయితే వంద కేసులు ఎదుర్కొంటా.. విష ప్రచారాలే లక్ష్యం అయితే వేయి ప్రచారాలు ఎదుర్కొంటా.. నా నిజాయితీ, సత్యం ధర్మమే నా ధైర్యం. నిజం బయటపడ్డాక మీ ముఖాలు ఎలా ఉంటాయో చూడటానికి నేను ఎదురుచూస్తు ఉంటానని విడదల రజినీ నెట్టింట్లో పేర్కొన్నారు.