కేంద్రమంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ అధినాయకుడికి బీదర్‌లో దొంగనోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ ఉందని తెలిపారు. దొంగనోట్లు వ్యాపారం చేసి ఎన్నికల్లో దొంగనోట్లు పంచారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల్లో ఉద్యోగులకు కాంగ్రెస్ అ నేక హామీలిచ్చింది. ఉద్యోగులకు ఇచ్చిన హామీలకు రూ.8 వేల కోట్లు కావాలని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ విధానాలు చూస్తుంటే మరో మూడు నెలల తర్వాత జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదని అన్నారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేస్తే పుట్టగతులుండవని హెచ్చరించారు. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడ్డట్లు చరిత్రలో లేదన్నారు. రైతులు తలుచుకుంటే ప్రభుత్వాలను మార్చేయగలరన్నారు. నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎఫ్పీవో వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు..