లోకేష్ కి దమ్ముంటే గుడివాడలో కొడాలి నానిపై పోటీ చేయాలి – మంత్రి కొట్టు

-

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రి కొట్టు సత్యనారాయణ. కొడాలి నానిని విమర్శించడం కాదని.. లోకేష్ కి దమ్ముంటే గుడివాడలో కొడాలి నాని పై పోటీ చేయాలని సవాల్ విసిరారు. చంద్రబాబు 14 ఏళ్లు అధికారంలో ఉండి లక్షల కోట్లు దోచి సింగపూర్ కి తరలించారని ఆరోపించారు. చంద్రబాబు సింగపూర్ లో బినామీని పెట్టుకుంటే.. అక్కడి ప్రభుత్వం అతడిని అరెస్టు చేసిందని అన్నారు.

 

ఇక తదుపరి అరెస్టు కాబోయేది చంద్రబాబేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు దగ్గర కిరాయి తీసుకుని ఏది చెబితే అది చెప్పడం పవన్ కళ్యాణ్ కి అలవాటేనని ఎద్దేవా చేశారు. అలాగే రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికలు రావలసిన అవసరం లేదని.. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version