మూడు “సీ” లు కలిస్తే దేశం సుభిక్షంగా ఉంటుంది.. ఆ మూడు సీలే కాంగ్రెస్, కమ్యూనిస్టులు, కంట్రీ కలవాలి.. అప్పుడే దేశం బాగుపడుతుందని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి రఘువీరారెడ్డి. కర్నూలులో జరుగుతున్న ఏఐకేఎస్ సదస్సులో పాల్గొని ప్రసంగించిన ఆయన ఆలిండియా కిసాన్ సభ 90 ఏళ్ల క్రితం ఏర్పాటు అయింది. స్వాతంత్య్రానికి పదేళ్ల ముందే స్థాపించి స్వాతంత్య్ర పోరాటం చేసిన మొదటి రైతు సంఘం ఏఐకేఎస్ అన్నారు. నేడు వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు రైతు సంఘాలతో చర్చించి అనేక నిర్ణయాలు తీసుకున్నామని గుర్తు చేశారు.
బీటీ పత్తి విత్తనాల ప్యాకెట్ రూ.1860 ఉంటే రూ.600 వేల కోట్ల రైతులకు ఆదా అయినట్టు వెల్లడించారు. రైతుల విషయంలో కమ్యూనిస్టుల ఆలోచన, కాంగ్రెస్ ఆలోచన ఒక్కటే అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రఘువీరారెడ్డి. దేశాన్ని కాపాడే శక్తి అవునన్నా కాదన్నా కాంగ్రెస్, కమ్యూనిస్టులకే ఉందన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ప్రధాని మోడీ నాగపూర్ లో ఆర్ఎస్ఎస్ ఆఫీస్ కి వెళ్లారు.