హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలోని మందు బాబులకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. రేపు శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా జంట నగరాల పరిధిలోని మొత్తం వైన్ షాపులు మూత పడనున్నాయి. ఈ మేరకు ఏప్రిల్ 06న వైన్ షాపులు బంద్ చేయాలంటూ రాచకొండ పోలీస్ కమిసనరేట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిణామంతో ఉదయం 10 గంటల నుంచి 10 గంటల వరకు మద్యం దుకాణాలు మూతపడనున్నట్టుగా పేర్కొన్నారు.
అలాగే నగర పరిధిలోని వైన్ షాపులతో పాటు కల్లు కంపౌండ్లు, బార్లు, రెస్టారెంట్లు, స్టార్ హోటల్లు కూడా క్లోజ్ చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. శ్రీరామనవమి సందర్భంగా నగరంలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలుగకుండా వైన్ షాపుల మూసివేతకు నిర్ణయం తీసుకున్నామని రాచకొండ పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఒకవేళ పోలీసులు ఆదేశాలను బేఖాతరు చేసి షాపులు తెరిస్తే సదరు యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే రేపు వైన్ షాపులు బంద్ అవ్వనున్నాయి. ఇవాల షాపుల ఎదుట మందు కొనుగోలు చేసేందుకు క్యూ కడుతున్నారు.