తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే ఎవరైనా సంప్రదాయాలు పాటించాలని సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి స్వామిజీ తెలిపారు. తాజాగా తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ సీఎం జగన్ ఏనాడైనా ఆయన సతీమణిని శ్రీవారి దర్శనానికి తీసుకొచ్చారా..? మన ఇంట్లో పూజ చేస్తేనే భార్య పక్కన ఉండేవిధంగా చూసుకుంటాం. హిందువుల మనోభావాలు, విశ్వాసాలను జగన్ ఏనాడు గౌరవించలేదని తెలిపారు.
తిరుమల క్షేత్ర ప్రాశస్త్రాన్ని వైసీపీ ప్రభుత్వం ఎప్పుడూ కాపాడలేదన్నారు. గత ఐదేళ్లలో ఎన్నో పాపాలు జరిగాయి. ప్రక్షాళన జరగాల్సిందే. ఏనాడు అయినా జగన్ డిక్లరేషన్ పై సంతకం చేశారా..? ఆలయాలు, పూజారులపై దాడులు జరిగినా ఏనాడు జగన్ స్పందించలేదు. గత ఐదేళ్లలో అనేక అఘాయిత్యాలు జరిగాయి. ఇలాంటి వాళ్లు తిరుమల క్షేత్రానికి వస్తున్నారంటే.. చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సనాతన పరిరక్షణ బోర్డు ఏర్పాటు కావాలన్నారు. దీనికి రాజకీయ పక్షాలన్నీ సహకరించాలి. జగన్, వైసీపీ పై మాకు వ్యక్తి గత ద్వేషం లేదు.. ఆలయాల సంప్రదాయాలను గౌరవించకపోవడాన్ని తప్పు పడుతున్నామని తెలిపారు శ్రీనివాసానంద సరస్వతి.