ఏపీలో మందుబాబులకు ఝలక్ తగిలింది. ఏపీలో కూడా మద్యం ధరలు పెరగనున్నాయి. మద్యం ధరలను 15 శాతానికి పెంచేందుకు అనుమతి తెలిపింది ఎక్సైజ్ శాఖ. రూ.99 క్వార్టర్, బీర్లు మినహా మిగిలిన అన్ని బ్రాండ్ల ధరల మద్యం ధరలు పెంపునకు నిర్నయం తీసుకున్నారు. ఇండియన్ మేడ్, ఫారిన్ లిక్కర్, బీర్ అని మూడు కేటగిరీలుగా విభజించి సరఫరా చేయనున్నారు.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2025/02/chandrababu-2.jpg)
ఇప్పటికే మద్యం షాపుల మార్జిన్‌ను 14.5 శాతం నుంచి 20 శాతానికి పెంచిన ఏపీ ప్రభుత్వం… రూ.99 క్వార్టర్, బీర్లు మినహా మిగిలిన అన్ని బ్రాండ్ల ధరల మద్యం ధరలు పెంపునకు నిర్నయం తీసుకోవడం జరిగింది.
ఇక అటు తెలంగాణ మందుబాబులకు రేవంత్ రెడ్డి సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. తెలంగాణలో బీర్ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఎండా కాలం వచ్చిన తరుణంలోనే తెలంగాణ రాష్ట్రంలో మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. బీర్ల ధరలను 15 శాతం పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.