విజయనగరం జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో సోమవారం ఆ జిల్లాలోని స్కూళ్ళు, కళాశాలలు, విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు జిల్లా కలెక్టర్. వర్షాలు సోమవారం కూడా కొనసాగే అవకాశం వున్నందున ప్రజా వినతులు స్వీకరణ కార్యక్రమం రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు జిల్లా కలెక్టర్. ఇక అటు శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, యానాం లకు ఆరెంజ్ అలర్ట్ కూడా ప్రకటించారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు గరిష్టంగా 70 కిలోమీటర్లు బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నాయని సమాచారం. రానున్న మూడు రోజులు మత్య్సకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. కళింగపట్నం, భీమిని పట్నం, గంగవరం, కాకినాడ పోర్టులలో మూడవ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గడిచిన 24 గంటలలో అత్యధికంగా విజయనగరంలో కళింగ పట్నం 11 సెంటిమిటర్ల వర్షపాతం నమోదు అయింది.