ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఫిబ్రవరి 1 నుంచి ఏపీలో రిజిస్ట్రేషన్ విలువలు పెరగనున్నాయి. అమరావతిలోని 29 గ్రామాల్లో భూమి విలువ పెంచడం లేదని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. విజయవాడ, భోగాపురం పరిసర ప్రాంతాల్లో పెరిగే అవకాశం ఉందని స్పష్టం చేశారు. గతంలో జరిగిన అక్రమాలను సరిదిద్దుతున్నామని చెప్పారు మంత్రి అనగాని సత్యప్రసాద్.
అమరావతి రాజధాని ప్రాంతంలో భూముల రిజిస్ట్రేషన్ విలువ పెరగదన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్..రాజధాని 29 గ్రామాల్లో భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంచే ఆలోచన లేదన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంపుదల కు సంబంధించి త్వరలో సమావేశం ఉంటుందన్నారు..వచ్చే నెల 1 నుంచి భూముల రిజిస్ట్రేషన్ విలువలు పెరుగుతాయన్నారు. రెవెన్యూ సదస్సులో అనేక సమస్యలు వస్తున్నాయన్నారు.అధికారులు పై చర్యలు ఉంటాయన్నారు అనగాని సత్యప్రసాద్.