కోనసీమలో దారుణం.. తాను ప్రేమిస్తున్న అమ్మాయితో మాట్లాడాడని ఇంటర్ విద్యార్థిపై దాడి..!

-

ఆంధ్రప్రదేశ్ లోని కోనసీమ జిల్లాలో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. తాను ప్రేమించిన యువతితో మాట్లాడాడనే కోపంతో ఇంటర్ విద్యార్థి పై కోపం పెంచుకున్న ఓ కుర్రాడు తన స్నేహితులతో కలిసి అతనిపై దాడి చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్ అవుతోంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే ఏఎఫ్డీటీ జూనియర్ కాలేజీ ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి పై ఓ బాలుడు కక్ష పెంచుకున్నాడు.

తాను ప్రేమిస్తున్న యువతితో మాట్లాడుతున్నాడని.. తన స్నేహితులకు చెప్పి దాడి చేసేందుకు ప్లాన్ వేశారు. తన ముగ్గురు స్నేహితులతో కలిసి విద్యార్థిని సినిమా హాల్ వెనుకాల ఉన్న స్థలంలోకి తీసుకెళ్లారు. వారందరూ కలిసి అతనిపై దాడి చేశారు. ఆపై చెట్టుకు కట్టి చొక్కాను మెడకు బిగించారు. చిత్ర హింసలకు గురి చేశారు. విద్యార్థి మెడలో ఉన్న గొలుసును బిగించడంతో మెడపై తీవ్ర గాయమైంది. తనను వదిలిపెట్టాలని వేడుకున్నప్పటికీ కనికరించలేదు. నిందితులు అదే కాలేజీలో ఫస్టియర్ చదివి మానేసి ఇళ్ల వద్దే ఉంటున్నట్టు సమాచారం. బాధిత విద్యార్థి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version