టీడీపీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు : చంద్రబాబు

-

వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఉభయ గోదావరి జిల్లాల ఇన్ చార్జీలు, క్లస్టర్ లతో కాకినాడ జోన్ 2 లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. బాదుడే బాదుడు కార్యక్రమంతోనే వైసీపీ పతనం ప్రారంభమైందన్నారు. ఇదేం ఖర్మరా బాబుతో టీడీపీ బలంగా పుంజుకుందని చెప్పారు.

భవిష్యత్ కి భరోసా అనే కార్యక్రమంతో జనానికి మంచి భరోసా ఇస్తున్నామని తెలిపారు. దీంతో జనంలో టీడీపీకి మంచి క్రేజ్ వచ్చిందని చెప్పారు చంద్రబాబు. రాజకీయాల్లో 45 ఏళ్ల నుంచి ఉంటున్నానని.. ఇంత అరాచకమైన పాలన ఎప్పుడూ చూడలేదన్నారు. రాష్ట్రంలో విధ్వంసాలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. అధిక ధరలతో ప్రజలు అల్లాడిపోతుంటే సైకో సీఎం అసలు పట్టించుకోవడం లేదన్నారు. రోడ్లు సరిగ్గా లేక ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వాటిని చూసి పైశాసిక ఆనందం పొందుతున్నారు మండిపడ్డారు చంద్రబాబు. గత శాసన మండలి ఎన్నికల నాటి నుంచి నాటి సర్పంచ్ ఎన్నికల వరకు టీడీపీ అభ్యర్థులే విజయకేతనం ఎగురవేస్తున్నారంటే భవిష్యత్ లో టీడీపీ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చని తెలిపారు చంద్రబాబు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version