ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పి.. తెలంగాణకు మరోసారి మొండి చేయి చూపింది. విశాఖ కేంద్రం గా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. వాల్తేర్ డివిజన్‌ను విశాఖపట్నం రైల్వే డివిజన్‌గా మార్పు చేసింది. కానీ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై తెలంగాణకు మరోసారి నిరాశ చూపింది కేంద్ర సర్కార్.
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో బంపర్ న్యూస్
- సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌కు ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రివర్గం
- ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో ఇచ్చిన హామీ ప్రకారం..
- విశాఖపట్నం కేంద్రంగా ఈ కొత్త రైల్వే జోన్‌ను ఏర్పాటుకి గ్రీన్ సిగ్నల్
- అలాగే.. వాల్తేరు డివిజన్‌ను విశాఖపట్నం డివిజన్‌గా పేరు మార్పు