ఏపీ కొత్త కేబినెట్ : జగన్ అసలు “చెల్లెమ్మ”లు ఎవరు ?

-

గత వారం.. ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి.. ఏపీ కేబినేట్‌ విస్తారణపై కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఆంధ్రప్రదేశ్ లో మంత్రి వర్గ విస్తరణ అనగానే సిఎం జగన్ ఎవరికి ఇస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఎవరిని సిఎం మంత్రి పదవులకు ఎంపిక చేస్తారని అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే ఇద్దరి పేర్లను బీసీల నుంచి సిఎం జగన్ ఎంపిక చేసారు అనే వార్తలు వస్తున్నాయి. మంత్రి కొడాలి నాని, పేర్ని నాని, కన్నబాబు, బొత్స సత్యనారాయణ మినహా మిగతా అందరిని మార్చే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మహిళా మంత్రుల విషయానికి వస్తే.. ప్రస్తుతం జగన్ కేబినెట్ లో పుష్ప శ్రీవాణి, మేకతోటి సుచరిత అలాగే తానేటి వనిత లు ఉన్నారు. క్యాబినెట్ విస్తరణ లో ఈ ముగ్గురి స్థానంలో… మరో ముగ్గురిని తీసుకునేందుకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే వైసీపీ పార్టీ తరఫున ఏపీ వ్యాప్తంగా మొత్తం 14 మంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పటికే ముగ్గురికి ఇవ్వగా మరో 11 మంది లో… కచ్చితంగా ముగ్గురికి ఛాన్స్ వస్తుంది.

అయితే ఈ ఎంపిక సీఎం జగన్ కు పెద్ద సవాల్ గా మారిపోయింది. ఏం మహిళా సభ్యురాలు ఇవ్వాలో తేల్చుకోలేని పరిస్థితి ప్రస్తుతం జగన్ ముందు ఉంది. ఉత్తరాంధ్ర నుంచి రెడ్డి శాంతి ( తూర్పు కాపు ) , ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన విశ్వాసరాయ కళావతి, పుష్పశ్రీవాణి ,భాగ్యలక్ష్మీ ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక ఉభయ గోదావరి జిల్లాలలో తానేటి వనిత ( SC) , ఎన్.ధనలక్ష్మీ ( ST) గుంటూరు జిల్లా నుండి మేకతోటి సుచరిత (SC) , విడదల రజనీ (BC) , ఉండవల్లి శ్రీదేవి (SC) , అనంతపురం జిల్లా నుండి ఉషాశ్రీచరణ్ ( BC) , జొన్నలగడ్డ పద్మావతి (SC) , చిత్తూరు జిల్లా నుండి రోజా , కర్నూల్ జిల్లా నుండి కంగాటి శ్రీదేవి , వైఎస్ఆర్ కడప జిల్లాలో దాసరి సుధ ( SC) ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న, సీనియారిటీ అలాగే ప్రాంతాల సమీకరణలు చూసుకున్నట్లయితే నగరి ఎమ్మెల్యే రోజా, విడతల రజిని, కళావతి, జొన్నలగడ్డ పద్మావతిలు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే కొత్త జిల్లాల ఏర్పాటు ప్రాతిపదికన కూడా మంత్రివర్గం విస్తరణ ఉండనుంది. అలాగే క్యాస్ట్ కాంబో ఆధారంగా కూడా సీఎం జగన్ మొగ్గు చూపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ లెక్కన చూస్తే.. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రోజా మొదలియార్ వర్గానికి చెందిన సెల్వమనిని పెళ్లి చేసుకున్నారు. నగరంలో గత ఎన్నికలలో రోజా… మరోసారి గెలవడానికి కారణం మొదలియార్ సామాజిక వర్గం మాత్రమే. ఇక ఇటు విడుదల రజిని బీసీ అయినప్పటికీ కాపు సామాజిక వర్గానికి చెందిన వీరభద్రం ను, డాక్టర్ శ్రీదేవి కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ శ్రీధర్ ను పెళ్లి చేసుకున్నారు. ఈ కాంబినేషన్ కారణంగా ఇటు బీసీ ఓటర్లు అటు కాపు ఓటర్లు… వైసీపీకి దగ్గరయ్యారు. అలాగే కళ్యాణదుర్గం నుంచి గెలిచిన కురుబ సామాజిక వర్గానికి చెందిన ఉషాశ్రీచరణ్ ..శ్రీ చరణ్ రెడ్డి ని వివాహం చేసుకున్నారు . గత ఎన్నికలలో ఈ క్యాస్ట్ కాంబినేషన్ వారివారి గెలుపులకు బాగానే దోహదపడింది. అయితే జగన్ చెల్లమ్మలు ఎవరు అవుతారో చూడాలి. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version