గ్రామ, వార్డు సచివాలయ సేవలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు అవసరమయ్యే ధ్రువీకరణ పత్రాల జారిని మరింత సులభతరం చేస్తూ వెసులుబాటు కల్పించింది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా జారీ చేసే సర్టిఫికెట్ల కోసం అవసరమైన ప్రతీసారి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండా కొత్త సదుపాయం అమల్లోకి తెచ్చింది.
ఏదైనా ధృవీకరణ పత్రం కోసం ఒకసారి దరఖాస్తు చేసుకొని పై అధికారులు ఆమోదం లభిస్తే, ఇంకోసారి మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండా అప్పటికప్పుడు సర్టిఫికెట్ జారీ చేసేలా కొత్త విధానం తీసుకొచ్చింది. ఇన్ కం, కుల ధ్రువీకరణ పత్రం, ఇతర కొన్ని సర్టిఫికెట్ల జారీకి మాత్రమే ఈ వెసులుబాటు కల్పించారు. ధృవీకరణ పత్రం ఒకసారి పొంది ఉండి, మరోసారి అదే సర్టిఫికెట్ మళ్ళీ అవసరమైనప్పుడు మళ్ళీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇంతకు ముందు పొందిన సర్టిఫికెట్ ను అప్పటికప్పుడు వెంటనే ఇవ్వను న్నారు.