అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కొత్త జిల్లాల ఏర్పాటు కసరత్తు… తుది దశకు చేరుకుంది. రేపు లేదా ఎల్లుండి తుది నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. న్యాయ పరమైన చిక్కులు రాకుండా జగన్ ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వానికి సుమారు 10-11 వేల వినతులు, అభ్యంతరాలు చేరాయి.
స్వల్ప మార్పులు మినహా పెద్దగా మార్పులు చేర్పులకు నో ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. డ్రాఫ్ట్ నోటిఫికేషనుకు.. తుది నోటిఫికేషనుకు పెద్దగా మార్పులు చేర్పులు ఉండవని చెబుతున్నారు అధికారులు.
బాలాజీ జిల్లా పేరు పెట్టాలన్న ప్రతిపాదనపై అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం… బాలాజీ జిల్లాగా కాకుండా కొత్త జిల్లాను తిరుపతి పేరుతోనే ఏర్పాటు చేస్తూ నోటిఫికేషనులో సనరణ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌లో చెప్పిన 11 రెవెన్యూ డివిజన్లకు అదనంగా మరో ఐదు డివిజన్లు ఏర్పాటు చేసే ఛాన్స్ ఉంది. ఇప్పటికే కొత్త జిల్లాల వారీగా పూర్తైన కేడర్ ఎలాట్మెంట్… కొత్త కలెక్టరేట్లల్లో మౌళిక సదుపాయాల కల్పనపై ఆయా జిల్లాల యంత్రాంగం చక చక పనులు కానిచ్చేస్తోంది.