ఏపీలో రామరాజ్యం కాదు..ఇసుకాసుర రాజ్యం నడుస్తోంది – వైసీపీ ఎంపీ

-

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న ఇసుకాసుర ప్రభుత్వానికి ప్రజలు ఎప్పుడు ముగింపు పలుకుతారోనని, ఇసుకను, మట్టిని అమ్ముకుంటున్న ఈ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు. రాష్ట్రంలో రెండు సంస్థలను ముందు పెట్టి, ఇసుకను బహిరంగగానే వేలం వేసి అమ్ముకుంటున్నారని, తూర్పుగోదావరి జిల్లాలో 35 కోట్లు, శ్రీకాకుళంలో 18 కోట్లు టార్గెట్ విధించారని, తూర్పుగోదావరి జిల్లాలో ఆదాయం తగ్గిందని, వెసులుబాటు కావడం లేదని చెప్పినప్పటికీ, కర్కశంగా వ్యవహరించడం వల్ల ప్రేమ్ రాజు అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడి తనువు చాలించాడని అన్నారు.

రాష్ట్రంలో ఇసుకాసురులు బకాసురులను మించిపోయారని, ఇసుక పేరిట ప్రభుత్వానికి 700 కోట్ల రూపాయలు జమ చేసి, వేల కోట్ల రూపాయలను ఇసుకాసురులు దోచుకుంటున్నారని, హైదరాబాదులోని పెద్దలకు సంవత్సరానికి 1050 కోట్ల రూపాయలు అందుతున్నాయని, ఇసుకపై ప్రభుత్వానికి 700 కోట్లు, హైదరాబాదులోని పెద్దలకు 1100 కోట్ల రూపాయలు ముట్ట చెపుతున్న ఇసుకాసురులు అంతకు రెండింతల ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారని అన్నారు. ఈ భారం అంతా అంతిమంగా ప్రజలపైనే పడుతుందని, రాయలసీమ నుంచి ఇసుకను బెంగళూరుకు తరలి వెళ్తుంటే, కోస్తా జిల్లాల నుంచి హైదరాబాదుకు ఇసుక చేరుతుందని, ఈ అవినీతి గురించి నీతిగా అంచనా వేసినప్పటికీ, మూడు వేల కోట్ల రూపాయలు హాం ఫట్ అయి ఉంటాయని, ఇసుక ద్వారా చిన్నాచితక నాయకుల నుంచి మొదలుకొని పెద్ద తలకాయల వరకు డబ్బులు ముడుతున్నాయని, మట్టిని తవ్వి కూడా డబ్బులు మూట కట్టుకుంటున్నారని అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version