అమూల్‌ పాల సేకరణపై జగన్‌ కీలక ఆదేశాలు

-

అమూల్‌ పాల సేకరణపై ముఖ్యమంత్రి జగన్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు. అమూల్‌ పాలసేకరణపైనా సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. 2,34,548 మహిళా రైతుల నుంచి అమూల్‌ పాల సేకరణ జరుగుతోందని.. ఇప్పటి వరకూ 419.51 లక్షల లీటర్ల పాల సేకరణ జరిగిందన్నారు.

cm jagan

పాల సేకరణ వల్ల ఇప్పటి వరకూ రూ.179.65 కోట్ల చెల్లింపు, రైతులకు అదనంగా 20.66 కోట్ల లబ్ధి చేకూరిందని వివరించారు. అమూల్‌ ప్రాజెక్టు వల్ల ఇతర డెయిరీలు పాల సేకరణ ధరలు పెంచాల్సిన పరిస్థితి ఉందని.. ఆయా డైరీలు ధరలు పెంచడం వల్ల రాష్ట్రంలో రైతులకు అదనంగా రూ.2,020.46 కోట్ల లబ్ధి చేకూరుతుందని వివరించారు.

వచ్చే రెండు నెలల్లో మరో 1,359 గ్రామాలకు విస్తరించనున్న అమూల్‌ పాల సేకరణ జరుగాలని.. అమూల్‌తో ప్రాజెక్టు ద్వారా ప్రతిరోజూ 1.03 లక్షల లీటర్ల పాల సేకరణ జరుగుతోందని చెప్పారు. చిత్తూరు డెయిరీని వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని సీఎం ఆదేశించారు. ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణ ప్రగతిని సమీక్షించిన సీఎం జగన్‌.. ఆర్బీకేల పరిధిలో వైయస్సార్‌ యంత్రసేవ కింద ఇస్తున్న పరికరాలు, యంత్రాలు అన్నీ కూడా రైతులకు అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version