పార్టీని వీడిన మోపిదేవిపై జగన్‌ సంచలన వ్యాఖ్యలు

-

పార్టీని వీడిన మోపిదేవిపై జగన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపల్లె వైసీపీ నేతల సమావేశంలో మోపిదేవిపై రాజీనామా పై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీని వీడి మోపిదేవి వెంకట రమణ వెళ్లిపోవడం బాధాకరమని… మోపిదేవి వెంకటరమణ విషయంలో ఎప్పుడూ తప్పు చేయలేదని తెలిపారు. ఏరోజైనా మోపిదేవి వెంకటరమణకి మంచే చేశామని తెలిపారు.

Jagan’s sensational comments on Mopidevi who left the party

తాను ఎమ్మెల్యేగా ఓడిపోయినా మంత్రిపదవి ఇచ్చామని గుర్తు చేశారు జగన్‌. మండలిని రద్దుచేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు ఆయన పదవిపోకుండా అడిగిన వెంటనే రాజ్యసభకు పంపామని వెల్లడించారు. ఒక మత్స్యకారుడికి తొలిసారిగా రాజ్యసభ ఇచ్చిన ఘనత మన పార్టీదన్నారు. ఇప్పుడు గణేష్‌కు మీ మద్దతు చాలా అవసరమని స్పష్టం చేశారు వైఎస్ జగన్. చంద్రబాబులా మనం అబద్ధాలు ఆడలేకపోయామని.. చంద్రబాబు అబద్ధాలతో పోటీ పడలేకపోయాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version