నీ కుటుంబం గురించి చెబితే ఉరి వేసుకుంటావ్ – జేసీ సంచలన వ్యాఖ్యలు

-

మాజీ మంత్రి పేర్ని నానిపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. నీ కుటుంబం గురించి చెబితే ఉరి వేసుకుంటావ్ అంటూ పేర్ని నానికి చురకలు అంటించారు. పేర్ని నానికి ఆడవాళ్లంటే గౌరవం ఉందా? మా మీద కేసులు పెట్టినప్పుడు మా ఇంట్లో ఆడవాళ్లు గుర్తుకురాలేదా? అని నిలదీశారు.

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మంచివాళ్లు కాబట్టే ఊరికే ఉన్నారు… నువ్వు తప్పు చేశావ్ కాబట్టే నీ మొహంలో రక్తం చుక్క లేదన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. నీకు బ్యాటరీ లేదు…ప్రెస్ మీట్ లో నాని మాట్లాడుతుంటే ముఖంలో రక్తం చుక్క కనబడలేదని చురకలు అంటించారు. గుడివాడ నాయకులు ఎక్కడికి వెళ్లారని నిలదీశారు.

వ్తెసీపీ హాయంలో ఐదేళ్లు టిడిపి కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తే అవి గుర్తుకు రాలేదా అని నిలదీశారు. నీచంగా మాట్లాడిన నాయకులను వదిలిపెట్టబోమని హెచ్చరించారు JC ప్రభాకర్‌. చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని పరితపిస్తున్నాడని తెలిపారు. ఐదు నెలలోనే వ్తెసీపీ వాళ్లు బయటకు వస్తున్నారంటే అది చంద్రబాబు మంచితనం వల్లే అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news