న్యూ ఇయర్ వచ్చేస్తోంది. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పబోతున్నాం. ఈ తరుణంలో న్యూ ఇయర్ పార్టీలు సహజమే. ఫ్యామిలీతో కలిసి పార్టీ చేసుకునే వాళ్ళు కొందరైతే, స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేసేవాళ్ళు మరికొంతమంది.
అయితే పార్టీ అనగానే ఎప్పటిలా కాకుండా ఈసారి కొత్తగా ట్రై చేయండి. న్యూ ఇయర్ పార్టీని గేమ్స్ తో హ్యాపీగా ఎంజాయ్ చేయండి.
గెస్ గేమ్:
సాధారణంగా కొత్త సంవత్సరం వస్తుంటే ఆ సంవత్సరంలో ఏదైనా చేయాలని రిజల్యూషన్స్ పెట్టుకుంటారు. మీ ఫ్రెండ్స్ ఎలాంటి రిజల్యూషన్స్ పెట్టుకున్నారో మీరు గెస్ చేయండి. దీన్ని ఒక గేమ్ లాగా ఆడండి. దీనికోసం అందరూ పేపర్లు, పెన్నులు తీసుకుని.. అవతలి వాళ్లు ఎలాంటి రిజల్యూషన్స్ తీసుకోవాలి అనుకుంటున్నారో వారి పేరుతో సహా రాయండి.
ప్రెడిక్షన్:
కొత్త సంవత్సరంలో ఏమేమి జరగబోతున్నాయో సరదాగా ఆలోచించి ఒక్కొక్కరు పేపర్ మీద రాయండి. ఆ తర్వాత సరదాగా చదువుకుంటే మంచి మజా వస్తుంది.
అంత్యాక్షరి:
ఈ గేమ్ ఎప్పటికీ పాత బడదు. సరదాగా అందరూ కలిసి పాటలు పాడుకుంటే ఆ ఆనందమే వేరు. జనరల్ గా ఫ్యామిలీతో కలిసి పార్టీ చేసుకునేటప్పుడు ఈ ఆట చాలా బాగుంటుంది.
బాల్ గేమ్:
ఒక బంతిని తీసుకుని ఒకరు నుండి మరొకరికి పాస్ చేస్తూ ఉండాలి. మ్యూజిక్ ఆగినప్పుడు బంతి ఎవరి దగ్గర అయితే ఆగిపోతుందో వాళ్లు సరదాగా సినిమా డైలాగ్ చెప్పడం పాట పాడటం చేయాలి.