అనంతపురం : మంత్రి ఉష శ్రీ చరణ్ వ్యాఖ్యలపై జేసీ కౌంటర్ ఇచ్చాడు. తండ్రి చనిపోతే మూడేళ్ల శవ రాజకీయాలు చేసింది జగన్మోహన్ రెడ్డి అని మండిపడ్డారు. శవ రాజకీయాలు చేసేది వైసిపి పార్టీ వాళ్ళు అని.. తాడిపత్రి కి వచ్చి నా మీద విమర్శలు చేయడం కాదని అగ్రహించారు. చనిపోయిన పాప తండ్రి వికలాంగుడు, పెన్షన్ ఇప్పించు అని డిమాండ్ చేశారు.
మీకంటే గట్టిగా విమర్శలు చేయగలను మొత్తం చెప్పగలను అని ఫైర్ అయ్యారు. మహిళ కాబట్టే అన్ని విషయాలు చెప్పాను అని చురకలు అంటించారు. కర్ణాటక లోకయుక్తా , సుప్రీం కోర్టు కేసులు విషయం చెప్పమంటారా ? అని నిలదీశారు. పింఛను ఇప్పిస్తే నీ ఇంటికి వచ్చి సన్మానం చేస్తానని స్పష్టం చేశారు. గతంలో ఏ పార్టీలో ఉన్నావో … ఒక్కసారి గుర్తు చేసుకో …! అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి పార్టీ నుంచి వైసీపీ పార్టీ లో చేరిన.. నీ గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు అని మండిపడ్డారు.