నారా లోకేష్ ను పిచ్చి కుక్కను కొట్టినట్లు కొడతాం – జోగి రమేష్

-

నారా లోకేష్ ను పిచ్చి కుక్కను కొట్టినట్లు కొడతామని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రి జోగి రమేష్. లోకేష్ ఒక అర బుడ్డాగాడని.. దొడ్డిదారిన నిన్ను మీ అయ్య మంత్రిని చేశాడని మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డి గురించి పిచ్చి పిచ్చి ప్రేలాపనలు పేలితే లోకేష్ దవడ పేలిపోవడం ఖాయమని.. మెడికల్ కాలేజీల పై ఎక్కడైనా మేమ చర్చకు సిద్ధమన్నారు.

లోకేష్ మీ అయ్య ఎన్ని మెడికల్ కాలేజీలు పెట్టాడోనని.. మేం ఎన్ని మెడికల్ కాలేజీలు పెడుతున్నామో చర్చిద్దామని పేర్కొన్నారు. చర్చకు మీరొచ్చినా సరే…మమ్మల్ని ఎన్టీఆర్ భవన్ కు రమ్మన్నా సరేనని సవాల్‌ విసిరారు. హెల్త్ యూనివర్శిటీ పేరు పెట్టడంలో తప్పు లేదని.. ఎన్టీఆర్ పేరు చిరస్థాయిలో నిలిపేందుకు చంద్రబాబు ఏనాడైనా ఆలోచన చేశావా అని నిలదీశారు. అధికారమున్నప్పుడు ఎన్టీఆర్ చంద్రబాబుకి గుర్తురాలేదా.. అధికారం పోగానే ఎన్టీఆర్ పై చంద్రబాబుకు ప్రేమ పుట్టుకొచ్చేసిందని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version