జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని, వారాహి యాత్ర పేరుతో అవాకులు చవాకులు పేలుతున్నాడని మండిపడ్డారు. అతడిని ఎవరికైనా చూపించండిరా అని ప్రజలు అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాపు ఓట్ల కోసం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ని వాడుకుంటున్నారని ఆరోపించారు.
చంద్రబాబు వెంట ఉన్నాడు కాబట్టే పవన్ కళ్యాణ్ ని ప్రజలు ఓడించారని అన్నారు. 175 నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ కి పోటీ చేసే దమ్ము ఉందా..? అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ కి ప్రాణహాని అనేది ఉంటే అది చంద్రబాబు దగ్గర నుంచే ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. జోకర్ లాంటి చంద్రబాబు.. లోఫర్ ఎలాంటి లోకేష్ మాటలు నమ్మవద్దని పవన్ కళ్యాణ్ కి మంత్రి కొట్టు హితబోధ చేశారు.