ప్రభుత్వ రంగ సంస్థలలో సుమారు రెండు లక్షల ఉద్యోగులను కేంద్రం తొలగించిందని ఆరోపించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. తద్వారా లక్షలాదిమంది యువత ఆశలపై ప్రభుత్వం నీళ్లు చెల్లిందని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థల నుంచి 2 లక్షల ఉద్యోగాలను తొలగించడం ఏ రకమైన ప్రగతి అవుతుందని ప్రశ్నించారు. ప్రగతిశీలక దేశంలో ఉద్యోగాలు తగ్గిపోవడం దేనికి సంకేతమని నిలదీశారు. 2014లో PSU ల్లో 16.9 లక్షల ఉద్యోగాలు ఉండగా.. 2022 నాటికి 16.6 లక్షలకు తగ్గాయి అన్నారు.
బిఎస్ఎన్ఎల్ లో 1,81,127, సెయిల్ లో 61,928, ఎంటిఎన్ఎల్ లో 34,997, ఎస్ఇసిఎల్ లో 29,140, ఎఫ్సీఐ లో 28,063, ఓఎన్జిసిలో 21, 120 ఉద్యోగాలు పోయాయి అన్నారు. ఉద్యోగులను తొలగించి, పారిశ్రామికవేత్తలకు రుణాలు మాఫీ చేయడమే అమృత్ కాలా అని ప్రశ్నించారు. ఇది నిజంగానే అమృత్ కాల్ అయితే ఉద్యోగాలు ఎందుకు మాయమవుతున్నాయని ప్రశ్నించారు.