కన్నాను కూల్ చేసినట్లేనా వీర్రాజు?

-

పార్టీ అధ్యక్షుడైనప్పటినుంచి టీడీపీ నేతలపైనా, చంద్రబాబుపైనా తనదైన శైలిలో విరుచుకుపడటంతోపాటు… కీలకమైన నేతలకు కలుస్తూ, కలుపుకుపోయే పనులకు పూనుకుంటున్నారు. ఈ క్రమంలోనే అటు చిరంజీవిని కలిసి ఇవ్వాల్సిన సంకేతాలు ఇచ్చిన వీర్రాజు… అనంతరం తాజాగా ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కలిశారు. ప్రస్తుతం ఈ భేటీ రాజకీయాల్లో ఆస్కక్తికరంగా మారింది.

ఏపీ బీజేపీలో కన్నాకు – సోము వీర్రాజు కు మధ్య ఉన్న బలమైన వ్యత్య్యాసం … బాబుపై ప్రేమ – కోపం ఉండటమే! కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నా కూడా కన్నా టీడీపీ అభివృద్ధికి సహకరించారనే కామెంట్లు కన్నా ఎదుర్కొన్నారు. ఆయన ప్రవర్తన కూడా అలాగే ఉండేదని బీజేపీ నేతలు కారాలు మిరియాలూ నూరేవారు. అలా నూరినవారిలో సోము కూడా ఒకరు! ఈ క్రమంలో కన్నాతో సోము భేటీ అయ్యారు.

గుంటూరులో కన్నాను ఆయన నివాసంలో కలిశారు సోము వీర్రాజు. ఈ భేటీలో… రాష్ట్రంలో బీజేపీ మరింత బలపడటానికి సహాయ, సహకారాలు అందించాలంటూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కోరారు. అందుకు కన్నా “సరే”నన్నా… ఆయన మనసులో ఎలాంటి ఆలోచన ఉంది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఎందుకంటే… బీజేపీ అధ్యక్షుడిగా కన్నాను తప్పించిన క్రమంలో… ఆయన టీడీపీలో చేరిపోబోతున్నారంటూ కథనాలొచ్చయి! అయితే… సోము మాత్రం తమ పర భేదం లేకుండా… తన సామాజికవర్గంలోని బలమైన నేతలు కలుపుకుని పోయే విధానానికి మాత్రం బలంగా తెరలేపినట్లేనని మరోసారి రుజువైంది!!

Read more RELATED
Recommended to you

Exit mobile version