సోమువీర్రాజు ఒక ప్యాకేజీ స్టార్ – కావలి ఎమ్మెల్యే

-

సోమువీర్రాజు ఒక ప్యాకేజీ స్టార్ అంటూ విరుచుకుపడ్డారు కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి. ఇవాళ నెల్లూరు జిల్లాలో…మీడియాతో కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ… బిజెపి రాష్ట్ర అద్యక్షుడు సోమువీర్రాజు ఒక ప్యాకేజీ స్టార్ అని.. నేను కట్టిన ఇంట్లో ప్రభుత్వ స్ధలం ఉందనే విమర్శలు చేసిన బిజెపి నేతలు నిరూపిస్తే ఇల్లు పగల కొట్టేందుకు నేను సిద్దమని సవాల్‌ చేశారు.

తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రత్యేక హాదా ఇస్తానన్న నరేంద్ర మోదీని సోము వీర్రాజు అడిగి ఎందుకు తీసుకు తలేకపోయారని ఆగ్రహించారు కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి. నేను ఏంటో కావలి ప్రజలకు తెలుసని…. సోము వీర్రాజు సర్టిఫికెట్ నాకు అవసరం లేదని మండిపడ్డారు కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి. బీజేపీకి అసలు ఏపీలో బలమే లేదని ఎద్దేవా చేశారు కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version