ఏపీ ప్రజలకు శుభవార్త..సంక్రాంతికి ప్రత్యేక బస్సులు నడుపనుంది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీ సంస్థ. సంక్రాంతి రద్దీ దృష్టిలో ఉంచుకుని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాకు ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనుంది ఆర్టీసీ. జనవరి 9 నుంచి 13 వరకు హైదరాబాద్ నుంచి ఒక్కో జిల్లాకు 100 కు పైగా సర్వీసులు నడుపనున్నారట. జనవరి 13 నుంచి 15 వరకు సర్వీసులు నడపనుంది ఆర్టీసీ.
అదనపు చార్జీలు లేకుండానే బస్సు సర్వీసులు కొనసాగించనుంది ఆర్టీసీ. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి చాలా మంది ప్రయాణికులు ఏపీకి వస్తూంటారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలోనే… హైదరాబాద్ నుంచి చాలా మంది ప్రయాణికులు ఏపీకి వస్తూంటారు. అందుకే సంక్రాంతి రద్దీ దృష్టిలో ఉంచుకుని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాకు ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనుంది ఆర్టీసీ. అదనపు చార్జీలు లేకుండానే బస్సు సర్వీసులు కొనసాగించనుంది ఆర్టీసీ.