వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కొంపలోని సమస్యలను పక్కన పెట్టి సినిమా వాళ్ల వెంట పోతారని…. వాళ్లు సినిమాల్లో మాత్రమే హీరోలు.. రియల్ లైఫ్‌లో కాదని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. కమల్‌హాసన్ కంటే పవన్ కల్యాణ్ గొప్ప నటుడేం కాదని చురకలు అంటించారు.
కమల్‌హాసన్ ఎన్నికల్లో ఓడిపోయాడు. చిరంజీవి రెండు చోట్ల పోటీ చేసి.. ఒక్క చోటే గెలిచాడన్నారు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. బాలకృష్ణ హిందూపురం కాబట్టి 3 సార్లు గెలిచాడని ఎద్దేవా చేశారు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. రాజకీయ ఒత్తిడి వల్లే విజయసాయిరెడ్డి రాజీనామా చేశాడని… కాకినాడ పోర్టు వ్యవహారంలో కేసులు చుట్టుముట్టడంతో విజయసాయిరెడ్డి ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు అన్నారు.
పార్టీ ఆఫీసులపై, ఇళ్లపై దాడి చేయడం ముమ్మాటికి తప్పే అని ఫైర్ అయ్యారు కేతిరెడ్డి. ఇలా చేయడం బ్యాడ్ కల్చర్ నేర్పించడమే అన్నారు. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు బూమ్ రాంగ్ అయ్యాయని చెప్పారు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి. లిక్కర్, ఇసుక పాలసీలు దెబ్బకొట్టాయని ఆగ్రహించారు.