ప్రకాశం బ్యారేజీపై వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు

-

కృష్ణా నదిపై నిర్మించిన ప్రకాశం బ్యారేజీని పరిశీలించారు ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. ప్రకాశం బ్యారేజీ గేట్లు విరిగిపోయిన ఘటనలో బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రకాశం బ్యారేజీ మరమ్మత్తు పనులు సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని ప్రభుత్వానికి సూచించారు.

కృష్ణా నదికి భారీగా వరద పోటెత్తడంతో.. ప్రకాశం బ్యారేజీ స్తంభాలు సైతం దెబ్బతిన్నాయని తెలిపారు. ఈ అంశాన్ని ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకోవాలని షర్మిల అభిప్రాయపడ్డారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ఎవరైనా కావాలనే పడవలను వదిలారా..? అనే సందేహాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యులను కఠినంగా శిక్షించకుంటే భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు మళ్లీ చోటు చేసుకునే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రకాశం బ్యారేజీ కి ఎంతో ఘన చరిత్ర ఉందని ఈ సందర్భంగా షర్మిల గుర్తు చేశారు. ఇక వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో నిర్మించిన ప్రాజెక్టులను జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని.. రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులు, బ్యారేజీలకు వార్షిక నిర్వహణ కూడా చేపట్టలేదని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version