వర్షాల కారణంగా ఇప్పటివరకు బుడగమేరకు ఇంకా గండ్లు పూడ్చలేకపోయామని తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. బుధవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వరద ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. ఎక్కడ ఎలాంటి అవసరం వచ్చిన తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
బురద తొలగింపు పనులు ప్రారంభం అయ్యాయని.. 62 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశామని తెలిపారు. 2,100 మంది పారిశుధ్య సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక 100కు పైగా ఫైర్ ఇంజన్లు వచ్చి సహాయక చర్యలలో పాల్గొని బురదని క్లీన్ చేస్తున్నామని తెలిపారు. మరోవైపు మృతదేహాలను బంధువులకు అప్పగిస్తున్నామని.. 32 మంది ఐఏఎస్ లు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు.
ఆహార పంపిణీలో వచ్చిన సమస్యలను పరిష్కరించామని తెలిపారు చంద్రబాబు. బాధితులకు నాణ్యమైన ఆహారాన్ని పంచుతున్నామన్నారు. ముంపు ప్రాంతాలలో తాగునీరు అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు ఎనిమిది లక్షల వాటర్ బాటిల్స్, 5 లక్షల మందికి భోజనం అందజేశామని తెలిపారు. మరోవైపు వరదలపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు.