జగన్ మోహన్ రెడ్డి సర్కార్ మరో కీలక నిర్నయం తీసుకుంది. కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో పనిచేస్తున్న పార్ట్ టైమ్ పీజీటీల జీతాలను ప్రభుత్వం భారీగా పెంచింది రూ. 12,000 నుంచి రూ. 26,759కు పెంచతూ సమగ్ర శిక్ష ఎస్పిడి శ్రీనివాసరావు ఉత్తర్వులు ఇచ్చారు.
పెరిగిన జీతం డిసెంబరు ఒకటి నుంచి అమల్లోకి వస్తుందన్నారు. పార్ట్ టైం పీజీటీల అసోసియేషన్ వినతి మేరకు ఈనెల 8న జరిగిన ఎగ్జిక్యూటివ్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇక అటు డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ప్రతి ఇంటికి ఆరోగ్య సిబ్బంది రానుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోట్ల మంది పేద మరియు మధ్య తరగతి ప్రజలకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలను అందిస్తోంది జగన్ సర్కార్. అయితే ఇటీవల ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించింది. ఇప్పుడు ఆరోగ్యశ్రీపై విశృత అవగాహన కార్యక్రమం చేపడుతున్నారు.