ఏపీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డిపై ఎమ్మెల్యే కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ధనుంజయ రెడ్డి అనే వ్యక్తి వైసీపీ ఎమ్మెల్యేలను గడ్డిపోచల్లా చూసేవాడని ఫైర్ అయ్యారు. సీఎం జగన్ ను కలవడానికి నేను క్యాంప్ ఆఫీసుకు వెళ్తే ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 వరకు కూర్చోబెట్టాడని ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

పార్టీ కోసం పని చేసిన నాలాంటి వాళ్లను చాలా నీచంగా చూసేవాడన్నారు. షాడో సీఎం కాదు, ఆయనే సీఎంలాగా వ్యవహరించేవారని ఫైర్ అయ్యారు. కాగా ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డికి ఈ నెల 20 వరకు రిమాండ్ విధించారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన సీఎంవో మాజీ కార్యదర్శి, విశ్రాంత ఐఏఎస్ అధికారి కె.ధనుంజయరెడ్డి(A31), ఓఎస్‌డీ కృష్ణమోహన్‌రెడ్డి(A32) ఉన్నారు.