Youtuber Jyoti Malhotra : యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై కేసు నేపథ్యంలో .. ఐదు రోజుల రిమాండ్ విధించింది కోర్టు. జ్యోతి మల్హోత్రా తెలుగు రాష్ట్రాల్లోనూ పర్యటించినట్లు బయటికి వచ్చింది ఓ వీడియో. పాకిస్థాన్ నిఘా సంస్థలతో జ్యోతి సంబంధాలు కలిగి ఉందని, సోషల్ మీడియా ద్వారా నిఘా సమాచారాన్ని పంపుతోందని హిసార్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కమల్జీత్ వెల్లడించారు.

జ్యోతి నాలుగు సార్లు పాకిస్థాన్లో పర్యటించిందని, ఈ కారణంగా భారత భద్రతా సంస్థలు ఆమెపై నిఘా ఉంచాయని స్పష్టం చేశారు.