పోసాని కృష్ణ మురళి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పోసాని కృష్ణ మురళిని PT వారెంట్ పై అదుపులోకి తీసుకున్నారు నరసరావుపేట పోలీసులు. 153A, 504, 67 ఐటీ యాక్ట్ కింద పోసానిపై కేసు నమోదు అయింది. నరసారావుపేట టూ టౌన్ సీఐ హేమారావు ఆధ్వర్యంలో పోసాని కృష్ణ మురళిని తరలించారు.
ఇక ఇవాళ మధ్యాహ్నం నరసరావుపేట కోర్టులో పోసాని కృష్ణ మురళిని హాజరు పరిచే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
- పోసాని కృష్ణ మురళిని PT వారెంట్ పై అదుపులోకి తీసుకున్న నరసరావుపేట పోలీసులు..
- 153A,504,67 ఐటీ యాక్ట్ కింద పోసానిపై కేసు నమోదు
- నరసారావుపేట టూ టౌన్ సీఐ హేమారావు ఆధ్వర్యంలో పోసాని తరలింపు
- మధ్యాహ్నం నరసరావుపేట కోర్టులో పోసానిని హాజరు పరిచే అవకాశం